Mahesh Babu: మహేశ్ బాబు 26వ సినిమాకి రంగం సిద్ధం

  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు 
  • అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్
  •  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్    

మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మికను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కీలకమైన పాత్రల్లో విజయశాంతి - రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక 'మహర్షి' సినిమాకి దేవిశ్రీ అందించిన ఆడియోకి తక్కువ మార్కులు పడిన నేపథ్యంలో, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఆయననే తీసుకుంటారా? తమన్ కి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News