Chittoor District: ఈ రోజంతా అక్కడ టీ ఉచితం... జగన్ అభిమాని వితరణ
- చిత్తూరు జిల్లా పలమనేరులో రంగాపురం పెట్రోల్ బంక్ వద్ద దుకాణం
- ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫ్రీ
- లక్ష మంది వచ్చినా ఉచితంగా ఇస్తానన్న నిర్వాహకుడు
అభిమానానికి హద్దుండదు. తన ప్రియతమ నేత అత్యున్నత పదవి చేపడుతున్నాడన్న ఆనందంలో అతను తనవంతు అభిమానాన్ని చాటుకుంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తన షాపులో ఉచితంగా టీ పంపిణీకి సిద్ధమయ్యాడు.
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన షబ్బీర్‌కు రంగాపురం పెట్రోల్ బంక్ వద్ద టీ దుకాణం ఉంది. అతనికి ఈ షాపే జీవనోపాధి అయినా ఈరోజు మాత్రం టీ ఉచితం అని ప్రకటించేశాడు. ఉదయం నుంచి టీ పంపిణీ మొదలు పెట్టిన షబ్బీర్ సాయంత్రం మూడు గంటల వరకు టీ పంపిణీ చేస్తానని, లక్ష మంది వచ్చినా టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. జగన్‌పై ఉన్న అభిమానంతో తానీ పని చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, మరికొందరు అభిమానులు పలమనేరులో అన్నదానం చేస్తున్నారు.