అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ
- అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ
- ప్రధానికి లేఖ
- వెంటనే స్పందించిన మోదీ
జైట్లీ పరిస్థితి పట్ల చలించిపోయిన మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య స్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. జైట్లీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన మోదీ వారికి ధైర్యం చెప్పారు. అయితే, క్యాబినెట్ లో చేరలేను అంటూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని జైట్లీని కోరారు. మోదీ విజ్ఞప్తి పట్ల జైట్లీ నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం.