Chandrababu: టీడీపీ ఓడిపోయింది అందుకు కాదట!: చంద్రబాబుపై విజయసాయి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓడిపోయింది ప్రజల్లో ఉన్న ఆగ్రహం వల్ల కాదని చంద్రబాబు తేల్చాడని, ఇంతకంటే దారుణమైన వక్రీకరణ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వైసీపీ పట్ల సానుభూతితోనే ఓట్లేశారు తప్ప, టీడీపీ అంటే జనాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తీరు చూస్తుంటే కింద పడ్డా తనదే పైచేయి అన్నట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆయన మానసిక పరిస్థితి మరింత దిగజారినట్టు కనిపిస్తోందని ట్వీట్ చేశారు. 23 సీట్లకు పరిమితం అయినా చంద్రబాబులో పరివర్తన రాలేదు సరికదా, అనుకూల మీడియాతో ఊహలు, కలలను రాయించుకుని తృప్తిపడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News