మీరు లేకుంటే నేను, నా టీమ్ కూడా తప్పుకుంటాం.. రాహుల్ కు సచిన్ పైలట్ అల్టిమేటం!
- కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన రాహుల్
- ఆయనే ఉండాలంటున్న పార్టీ శ్రేణులు
- తన ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేస్తానన్న సచిన్ పైలట్
రాజస్థాన్ లో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్, ప్రస్తుతం అధికార పీఠాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలున్నారు. తొలుత సచిన్ పైలట్ నే సీఎం పదవి వరిస్తుందని వార్తలు రాగా, ఆపై సీనియర్ నేత అయిన కారణంగా అశోక్ గెహ్లాట్ పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. తాజాగా సచిన్ పైలట్ హెచ్చరికలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.