సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- క్రేజీ ప్రాజక్టులో అనుష్క
- శివకు రజనీకాంత్ నుంచి పిలుపు
- విలన్లతో ఫైట్ చేస్తున్న రవితేజ
* ఇటీవల అజిత్ తో 'విశ్వాసం' చిత్రాన్ని రూపొందించి ఘన విజయం సాధించిన దర్శకుడు శివకు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రానికి ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారం.
* రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో, విలన్ గ్రూప్ మధ్య యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.