ఓ మహిళ ఫిర్యాదుతో కేఏ పాల్ పై క్రిమినల్ కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
ఓ మహిళ ఫిర్యాదుతో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్త
సత్యవతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా స్పాన్సర్ షిప్ లెటర్ కోసం పాల్ కు  రూ.15 లక్షల చెక్కు ఇచ్చానని, ఆ డబ్బు డ్రా చేసుకున్న తర్వాత తనను మోసం చేశారని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. కేఏ పాల్ అనుచరులు జ్యోతి, విజయ్ పైనా కేసు నమోదైంది.

Go Back to Shorts
Hyderabad
praja shanti
ka pal
bhel

More Telugu News