Inox: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐనాక్స్ తెరపై భారత్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం!

  • ఐసీసీతో ఐనాక్స్ లీజర్ ఒప్పందం
  • 15 కీలక మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఐనాక్స్
  • స్టేడియంలో చూస్తున్నట్టే ఉంటుందన్న ఐనాక్స్ సీఈవో

టీమిండియా క్రికెట్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే. దేశంలోనే రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన ఐనాక్స్‌ థియేటర్లలో భారత జట్టు ఆడే ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దక్కనుంది. ఇందుకోసం ఐనాక్స్ లీజర్-ఐసీసీ చేతులు కలిపాయి. ప్రపంచకప్‌లో భారత్ ఆడే 9 మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి మొత్తంగా 15 కీలక మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణె, జూపూర్, ఇండోర్, వడోదర, సూరత్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని ఐనాక్స్ థియేటర్లలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐనాక్స్‌లోని భారీ తెరలపై మ్యాచ్‌లను వీక్షించడం ద్వారా నేరుగా స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూసే అనుభూతి లభిస్తుందని ఐనాక్స్ లీజర్ సీఈవో అలోక్ టాండన్ పేర్కొన్నారు.

More Telugu News