‌IT Grids: ఐటీ గ్రిడ్స్ అశోక్ కోసం ముంబయిలో గాలింపు!

షార్ట్స్‌లో చూడండి
డేటా తస్కరణ కేసులో పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత దాకవరపు అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అశోక్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే అశోక్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ కోర్టు తిరస్కరణకు గురైన నేపథ్యంలో పోలీసులు ఆయన కోసం తీవ్రస్థాయిలో వేట సాగిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు ముంబయిలో కూడా అశోక్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. అశోక్ ను విదేశాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడమే ఈ నోటీసుల ఉద్దేశం.
Go Back to Shorts
‌IT Grids
Ashok

More Telugu News