Mahesh Babu: 'మహర్షి'పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ!

  • భారీ కలెక్షన్లను రాబడుతున్న 'మహర్షి'
  • సందేశమిచ్చే సినిమాలు తీయబోను
  • మహేశ్ లేకుంటే 'మహర్షి'ని ఎవరు చూస్తారన్న వర్మ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న వేళ, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గ్రామాలన్నా, పంట పొలాలన్నా పడదని, అందువల్ల తాను రైతుల ఆధారిత కథలను సినిమాలుగా నిర్మించలేనని అన్నారు. ఏ సినిమాలోనూ సందేశం ఇవ్వాలని కూడా తాను ప్రయత్నించబోనని అన్నారు. మహేశ్ బాబు లేకుంటే 'మహర్షి' సినిమాను ఎంత మంది చూస్తారని ప్రశ్నించిన ఆయన, సినీ ప్రేక్షకులు హీరో, పాటలు, కామెడీ సన్నివేశాల కోసమే సినిమాలకు వస్తారని అన్నారు. 'మహర్షి' సినిమానూ కేవలం వినోదం కోసమే చూస్తున్న ప్రేక్షకులు, బయటకు వచ్చిన తరువాత సినిమాలో సందేశం ఉందని చెబుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు.
Mahesh Babu
Maharshi
Varma

More Telugu News