Crime News: మురుగు కాలువలోకి దూసుకుపోయిన బుల్లెట్‌...వాహన చోదకుడి మృతి

  • బురదలో కూరుకుని ఊపిరాడక చనిపోయిన వ్యక్తి
  • కర్నూలు జిల్లా నంద్యాలలో ఘటన
  • మృతుడు ఫర్నీచర్‌ షాపు యజమాని
మురుగు కాలువలోకి బుల్లెట్‌ దూసుకుపోయిన ఘటనలో దాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కర్నూల్‌ జిల్లా నంద్యాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. స్థానికంగా ఫర్నీచర్‌ షాపు నడుపుతున్న నగేష్‌ సొంతపనిపై బుల్లెట్‌పై వెళ్తున్నాడు. పట్టణంలోని శోభాలాడ్జి సమీపంలోకి వచ్చేసరికి బండి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న మురుగు కాలువలోకి దూసుకుపోయింది. ఆ సమయానికి కాలువలో పూడిక, బురద పేరుకుపోయి ఉంది. బుల్లెట్‌ వేగానికి నేరుగా కాలువలో పడిన నగేష్‌ బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు హుటాహుటిన కాలువ వద్దకు చేరుకుని కాలువ బురదలో చిక్కుకున్న నగేష్‌ను బయటకు తీసినా అప్పటికే మృతి చెందాడు.
Crime News
Kurnool District
bullet
one died

More Telugu News