అరుణ్ జైట్లీ ఆరోగ్యంగా ఉన్నారు.. మీడియా సంయమనం పాటించాలి: కేంద్ర ప్రభుత్వం
- అరుణ్ జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ కథనాలు
- చికిత్స కోసం లండన్, అమెరికా వెళ్లనున్నారంటూ ప్రచారం
- వార్తలు పూర్తిగా అవాస్తవమన్న ప్రభుత్వం
అరుణ్ జైట్లీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనపై వస్తున్న వార్తలు పూర్తిగా సత్యదూరమని అరుణ్ జైట్లీ కాలేజీ స్నేహితుడు, మీడియా దిగ్గజం రజత్ శర్మ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, పూర్తిగా కోలుకున్నారని ఆయన తెలిపారు.