Kidari Sravan: టీడీపీ తరఫున బరిలోకి దిగి... డిపాజిట్ దక్కించుకోలేక పోయిన ఏకైక అభ్యర్థి!

  • తండ్రి మరణంతో తెరపైకి వచ్చిన కిడారి శ్రావణ్‌
  • డిపాజిట్ దక్కాలంటే 26,263 ఓట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి
  • 19,929కే పరిమితమైన కిడారి

ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగగా, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన 175 మందిలో ఒకే ఒక్క అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. మావోయిస్టుల చేతిలో తండ్రిని కోల్పోయి, అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చి, ఒక్క ఎన్నికలోనూ గెలవకుండానే మంత్రి పదవిని చేపట్టి, ఈ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేసిన కిడారి శ్రావణ్‌ కు మాత్రమే డిపాజిట్ దక్కలేదు. అరకు నియోజకవర్గంలో 1,57,575 ఓట్లు పోలవ్వగా, డిపాజిట్‌ కోసం కనీసం 26,263 ఓట్లు దక్కించుకోవాలి. మాజీ మంత్రి శ్రావణ్‌ కుమార్‌ కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనప్పటికీ, 174 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ ను దక్కించుకున్నారు. ఒక్క శ్రావణ్‌ కుమార్‌ మాత్రమే డిపాజిట్‌ కోల్పోయారు. కాగా, అరకు అసెంబ్లీ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన సియ్యారి దొన్నుదొర 27,660 ఓట్లను పొంది డిపాజిట్‌ ను దక్కించుకోవడం విశేషం.

More Telugu News