vishal: తెలుగులోను విడుదల కానున్న 'అయోగ్య'

  • 'టెంపర్' రీమేక్ గా 'అయోగ్య'
  • క్లైమాక్స్ లో మార్పులు
  • విశాల్ ఖాతాలోకి మరో హిట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' సినిమా, మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా 'అయోగ్య' పేరుతో రీమేక్ చేశారు. ఇటీవలే అక్కడ విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లనే సాధించింది .. విశాల్ ఖాతాలో మరో హిట్ ను వేసేసింది. తెలుగు సినిమా రీమేక్ కనుక తెలుగులోకి డబ్ చేయమని ఒక సందర్భంలో విశాల్ చెప్పాడు.

కానీ తాజాగా ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ సినిమాకి సంబంధించి కథలో చివరి అరగంటలో చాలా కీలకమైన మార్పులు చేశారట. మార్చబడిన క్లైమాక్స్ కి అక్కడ మరిన్ని మార్కులు పడ్డాయట. అందువలన ఈ సినిమాను తెలుగులోకి అనువదించడం వలన, క్లైమాక్స్ లోని కొత్త కిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మల్కాపురం శివకుమార్ తెలుగు అనువాద హక్కులను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. 

More Telugu News