modi: టీడీపీ ఓటమికి జన్మభూమి కమిటీలే కారణం!: ‘లోక్ సత్తా’ జయప్రకాశ్ నారాయణ

  • ఏపీలో కులాల కురుక్షేత్రం జరుగుతోంది
  • అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతం వీడాలి
  • ఏపీకి న్యాయం చేయాలి
రెండోమారు ప్రధాని కానున్న మోదీకి, తొలిసారి ముఖ్యమంత్రి కానున్న జగన్ కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) అభినందనలు తెలిపారు. ఏపీలో కులాల కురుక్షేత్రం జరగుతోందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ నుంచి నిధులు తేలేని పక్షంలో పన్నులు మాఫీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. ఏపీలో టీడీపీ ఓటమికి జన్మభూమి కమిటీలే కారణమని జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
modi
bjp
loksatta
jp
jagan
YSRCP

More Telugu News