YSRCP: జగన్ విజయంపై రాంగోపాల్ వర్మ సాంగ్!

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలోని ఓ పాటకు జగన్ విజ్ వల్స్
  • ‘విజయం విజయం..’పాటకు జతపరిచిన విజ్ వల్స్  
  • ‘చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరీ..ఇది ఎన్టీఆర్ రివెంజ్’ అనే క్యాప్షన్

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ విజయాన్ని అభినందిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ పాటను విడుదల చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలోని ‘విజయం విజయం ఘన విజయం.. విజయం విజయం శుభసమయం..’ పాటకు జగన్ పాదయాత్ర విజువల్స్ ను జతపరిచి ఈ సాంగ్ ను పోస్ట్ చేశారు. ‘చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరీ.. ఇది ఎన్టీఆర్ రివెంజ్’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో సాంగ్ ను వర్మ పోస్ట్ చేయడం గమనార్హం.

More Telugu News