Tadepalli: జగన్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు

  • తాడేపల్లిలో జగన్ నివాసం
  • ఇంటి పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు
  • భద్రతా చర్యలేనన్న ఉన్నతాధికారులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసాన్ని, దాన్ని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జగన్ ఇంటికి దారితీసే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి, ఆ రూట్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి కావడంతో, నిబంధనల మేరకు భద్రతను పెంచామని ఉన్నతాధికారులు అంటున్నారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్ర పరిస్థితులను సమీక్షించనున్నారు. చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఆపై వైసీపీ తరఫున గెలిచిన అభ్యర్థులతోనూ జగన్ సమావేశం కానున్నారు.
Tadepalli
Police
Jagan
House

More Telugu News