ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత!

  • సీఎం నివాసం దగ్గర వైసీపీ కార్యకర్తల నినాదాలు
  • వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న సెక్యూరిటీ 
  • టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉండటంతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో, వైసీపీ కార్యకర్తలను అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్టు స్థానికుల సమాచారం.
Go Back to Shorts
Guntur District
Undavalli
cm
Chandrababu

More Telugu News