ummareddy venkateshwarlu: ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు: వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

  • ప్రజలతో జగన్ మమేకమయ్యాడు 
  • ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొన్నాడు
  • ప్రజల నాడిని చంద్రబాబు తెలుసుకోలేకపోయారు        

ఏపీలో వెలువడుతోన్న ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభంజనాన్ని చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ .. "జగన్ మోహన్ రెడ్డి ప్రజల్తో మమేకమై వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన విజయాన్ని సాధించారు.ప్రజలంతా ఆయన పట్ల విశ్వాసాన్ని వుంచి 'మీరే మాకు నాయకత్వం వహించాలి' అంటూ చారిత్రక తీర్పునిచ్చారు అని అన్నారు..

ఇటీవల వైసీపీకి 130 నుంచి 135 సీట్లు రానున్నాయని జాతీయ మీడియా చెబితే చంద్రబాబు నాయుడు అపహాస్యం చేశారు. ప్రజలనాడి ఎలా ఉందనేది ఆయనకి అర్థం కాకపోవడం శోచనీయం. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ మంచి ఫలితాలనే ఇస్తున్నాయి .. అవి రాజకీయ చిత్రపటం నుంచి తొలగిపోవు అనే విషయం స్పష్టమైంది. జగన్ పార్టీకి నాయకత్వం వహించిన తొలినాళ్లలో అతి స్వల్పమైన తేడాతో ఆయన ఓడిపోయినప్పుడు కూడా మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని ఆయన చాలా హుందాగా ఆ ఓటమిని స్వీకరించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతంగా ఉండాలనీ .. అధికారం లేకపోతే బతకలేను అన్నట్టుగా వ్యవరిస్తున్న తీరు విచారకరం"అని అన్నారు.

More Telugu News