Gannavaram airport: గన్నవరం విమానాశ్రయంలో ప్రమాదం.. కూలిన ఆర్చ్

  • గన్నవరానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా
  • సుందరీకరణ పనుల్లో అపశ్రుతి
  • కుప్పకూలిన శ్లాబ్
ఇటీవలే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ముఖద్వారం వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్చ్ బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడ్డారు. సుందరీకరణ పనుల్లో భాగంగా ఆర్చ్‌పై కాంక్రీటు పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.  సపోర్టు కోసం సెంట్రింగ్ కింద ఏర్పాటు చేసిన కర్రలు పక్కకు ఒరగడంతో శ్లాబ్ ఒక్కసారిగా కూలింది. కాంక్రీటు, ఐరన్ రాడ్లు మీదపడడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Gannavaram airport
concrete work
Vijayawada
Andhra Pradesh

More Telugu News