Salman Khan: తన పెళ్లి గురించి నేడు ప్రకటిస్తానంటున్న సల్మాన్ ఖాన్!

  • ప్రస్తుతం 'భరత్' ప్రమోషన్ లో సల్మాన్
  • పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియా
  • ఎన్నికల ఫలితాల రోజు చెబుతానని జోక్
ఐదు పదుల వయసు దాటినా, ఇప్పటికీ, బాలీవుడ్ సెలబ్రిటీల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హోదాను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్, పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. తాను నటించిన 'భరత్' సినిమా ప్రమోషన్ లో భాగంగా విలేకరులతో మాట్లాడుతున్న వేళ, పెళ్లి గురించిన ప్రశ్న ఎదురుకాగా, స్పందించారు. "నా పెళ్లి గురించి 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు (మే 23) ప్రకటిస్తా" అని ఆయన ఓ జోక్ చేశారు. వచ్చే ఐదేళ్ల కాలానికీ పీఎంగా ఎవరు అధికార పీఠం ఎక్కుతారో నేడు తేలనుండగా, ఈ రిజల్ట్స్ కన్నా తన పెళ్లి గురించే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కాగా, నిన్న ఆయన మాట్లాడుతూ, తనకు పిల్లలు కావాలే తప్ప, వారికి తల్లి వద్దన్నట్టుగా మాట్లాడటంతో, సరోగసీ ద్వారా బిడ్డలను కనాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
Salman Khan
Marriage
Bharat

More Telugu News