Andhra Pradesh: టీడీపీ గెలవబోతోంది..చంద్రబాబే మళ్లీ సీఎం: పార్టీ అధికార ప్రతినిధి యామిని

  • ఎగ్జిట్ పోల్స్ చెప్పినన్ని స్థానాలు ఎన్డీఏకు రావు
  • ఎన్డీఏకు రెండు వందల స్థానాలు కూడా కష్టమే
  •  బీజేపీ నేతలకు మతిభ్రమించినట్టుంది
ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగా ఎన్డీఏకు అన్ని స్థానాలు రావని, రెండు వందల స్థానాలు రావడం కూడా కష్టమని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ వస్తుందని, ఏపీలో టీడీపీ ఓడిపోతుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వారికి మతి భ్రమించినట్టుగా తోస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతోందని, చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 
Andhra Pradesh
Telugudesam
samineni
yamini

More Telugu News