Road Accident: హైదరాబాదులో స్కూలు బస్సుపైకి దూసుకుపోయిన లారీ.. తప్పిన ప్రమాదం

  • ఆ సమయానికి బస్సులో విద్యార్థులెవరూ లేరు
  • విద్యార్థులను తెచ్చేందుకు వెళ్తుండగా ఘటన
  • లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడమే కారణమని సమాచారం

విద్యార్థులను తెచ్చేందుకు వెళ్తున్న ఓ పాఠశాల బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన సంఘటన హైదరాబాద్‌లోని ఖాజాగూడ చౌరస్తాలో జరిగింది. బస్సులో డ్రైవర్‌ తప్ప విద్యార్థుల్లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు నగరంలోని ఓ పాఠశాలకు చెందిన బస్సు శంకర్ మఠం డీడీ కాలనీలో ఉన్న విద్యార్థులను తెచ్చేందుకు బయలుదేరింది. బస్సు వెనుక కొద్ది దూరంలో ఇటుక లోడుతో ఓ లారీ వస్తోంది. ఖాజాగూడ చౌరస్తాకు వచ్చేసరికి లారీ బ్రేకులు ఫెయిలై అదుపు తప్పడంతో బస్సు వెనుక భాగం నుంచి ఓ వైపునకు దూసుకుపోయింది. అయితే, బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News