Vijay Sai Reddy: చంద్రబాబు చేయని కుతంత్రం లేదు: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ను నిలిపివేయించేందుకు చంద్రబాబు కుతంత్రాలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు. వివిప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపి హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి" అని అన్నారు.



Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News