అప్పుడే అల్లు అర్జున్ కి జోడీగా ఛాన్స్?
- అల్లు అర్జున్ తాజా చిత్రంతో త్రివిక్రమ్
- రెండో షెడ్యూల్ కి సన్నాహాలు
- కేతిక శర్మతో సంప్రదింపులు
పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా రూపొందుతోన్న 'రొమాంటిక్' సినిమాలో కథానాయికగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించడంతో, ఆయన టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. అల్లు అర్జున్ జోడీగా ఛాన్స్ పట్టేసిందంటే మాత్రం అదృష్టవంతురాలే!