tamannah: ఒకే రోజున విడుదలవుతోన్న తమన్నా రెండు హారర్ సినిమాలు

  • తమన్నా , ప్రభుదేవా జంటగా తమిళంలో 'దేవీ 2'
  • హిందీలో భయపెట్టనున్న 'ఖామోషి'
  • రెండు సినిమాల విడుదల తేదీ ఈ నెల 31  

ఒక హీరో .. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా - ప్రభుదేవా విషయంలో జరుగుతోంది. తమిళంలో తమన్నా - ప్రభుదేవా కలిసి 'దేవి 2' ( అభినేత్రి 2) సినిమా చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా - ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో 'ఖామోషి' హారర్ సినిమా నిర్మితమైంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇలా తమన్నా - ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున  ప్రేక్షకులను పలకరించనుండటం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి. 

More Telugu News