BJP: కేసీఆర్‌, చంద్రబాబు ఏకమైనా బీజేపీని ఏం చేయలేరు: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

  • పేకాటలో జోకర్‌లాంటి వాడు చంద్రబాబు అని వ్యాఖ్య
  • టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ను విలీనం చేయాలని సూచన
  • గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోవడమే మిగిలింది

దేశంలో ఎన్డీయే కూటమి సొంతంగా మెజార్టీ సాధించి మళ్లీ మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, ఈ విజయంతో సింహం సింగిల్‌గానే దూసుకువస్తుందని మోదీ నిరూపించనున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ అవినీతి రహిత, సంక్షేమ పాలన వల్లే ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్‌ ఏకమైనా బీజేపీని ఏమీ చేయలేరన్నారు.

 దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఒకరు అడవి బాట పడితే, మరొకరు రాష్ట్రాలు పట్టుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేకాటలో జోకర్‌లా మారిపోయాడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధీ భవన్‌కు టులెట్‌ బోర్డు తగిలించి టీఆర్‌ఎస్‌లో విలీనం కావడం బెటర్‌ అన్నారు. దోచుకున్న డబ్బు దాచుకోనివ్వడనే విపక్షాలన్నీ మళ్లీ మోదీ ప్రధాని కాకూడదని కంకణం కట్టుకున్నాయని, కానీ ప్రజలకు మోదీపై నమ్మకం ఉందన్నారు. మళ్లీ సంక్షేమ రాజ్యం రాబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నువ్వానేనా అన్న రీతిలో పోరాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.

More Telugu News