ఆ రెండు ఊర్లలో వైసీపీ చాలా బలంగా ఉంది.. అందుకే టీడీపీ నేతలు రీపోలింగ్ కోరారు!: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
- చంద్రగిరిలో దశాబ్దాలుగా దళితులు ఓటింగ్ కు దూరం
- అందుకే నేను వారి కోసం పోరాడాను
- ఐదు గ్రామాల్లో రీపోలింగ్ దళిత-గిరిజనుల విజయమే
ఈ వ్యవహారంలో కమ్మపల్లె, ఎన్ఆర్ కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో ఈసీ రీలిపోంగ్ కు ఆదేశించడం దళిత- గిరిజనుల విజయమని అభిప్రాయపడ్డారు. కాలేపల్లి, కుప్పం బాదూరులో వైసీపీ చాలా బలంగా ఉందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అందుకే టీడీపీ నేతలు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని పట్టు పట్టారనీ, కానీ తాము మాత్రం అందుకు అభ్యంతరం చెప్పలేదని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.