Narendra Modi: మోదీ ధ్యానం చేసిన గుహ ప్రత్యేకతలు ఇవే!

  • రాళ్లను, శిలలను తొలిచి గుహ ఏర్పాటు
  • గుహలో అటాచ్డ్ వాష్ రూమ్
  • మోదీ రాకతో సీసీ కెమెరాల ఏర్పాటు

సార్వత్రిక ఎన్నికల ముగింపుకు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ పుణ్యక్షేత్రంలోని ఓ గుహలో రాత్రంతా ధ్యానముద్రలో గడిపిన సంగతి తెలిసిందే. సముద్రమట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్ నాథ్ క్షేత్రంలో అత్యంత చల్లని వాతావరణంలో అంతసేపు ధాన్యం చేయడం మామూలు విషయం కాదు. అయితే, ప్రధాని ధ్యానం చేసిన గుహకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇది రాళ్లను తొలిచి ఏర్పాటు చేసిన గుహ. ఇందులో ధారాళంగా వెలుతురు ప్రవహిస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్ రూమ్, కిటికీ కూడా ఏర్పాటు చేశారు. గుహ గోడలకు దుస్తులు తగిలించుకునే హ్యాంగర్లు కూడా ఫిట్ చేశారు. ఇక్కడి నుంచి చూస్తే కేదార్ నాథ్ క్షేత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ రాకతో ఇక్కడ పరుపులు, దిండ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ గుహను అనేక రాళ్లను, కఠినశిలలను తొలిచి గతేడాదే సిద్ధం చేశారు. అయితే అప్పటినుంచి మూతపడే ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ గుహను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించారు.

More Telugu News