Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రెడీ అవుతున్న తాప్సీ 'గేమ్ ఓవర్'
  • మహేశ్ సినిమాకి మరో టైటిల్ 
  • కశ్మీర్ వెళుతున్న 'వెంకీమామ'   

*  తాప్సీ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'గేమ్ ఓవర్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో అశ్విన్ శరవణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 14 న విడుదల చేస్తారు.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దిల్ రాజు, అనిల్ సుంకర కలసి నిర్మించే ఈ చిత్రానికి 'రెడ్డి గారి అబ్బాయి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
*  వెంకటేశ్, నాగ చైతన్య కలసి నటిస్తున్న 'వెంకీమామ' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 20 నుంచి కశ్మీర్లో జరుగుతుంది. ఇరవై ఐదు రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నాడట.

More Telugu News