Chiranjeevi: చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు రాళ్లపల్లిని తొలిసారి కలిశాను: చిరంజీవి
తెలుగు చిత్రసీమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాళ్లపల్లి ఇవాళ సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాళ్లపల్లి మృతికి ఆయన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లిని కలిశానని చిరంజీవి వెల్లడించారు.
రాళ్లపల్లి నటన సహజంగా ఉంటుందని, అందుకే ఆయన నటన అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో రాళ్లపల్లి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.
73 ఏళ్ల రాళ్లపల్లి గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. శ్వాసకోశ సంబంధ వ్యాధితో ఆయన హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి.