rahul gandhi: మామిడి పండు ఎలా తినాలనేది మాత్రమే ఆయన నేర్పుతున్నారు: రాహుల్ గాంధీ

  • మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన రాహుల్
  • అవినీతి, నిరుద్యోగంపై అస్సలు మాట్లాడటం లేదు
  • అకౌంట్లలోకి రూ. 15 లక్షలు పడతాయన్న హామీని నెరవేర్చలేదు

నిరుద్యోగం, రైతు సమస్యలు, అవినీతి గురించి ప్రధాని మోదీ అస్సలు మాట్లాడటం లేదని... మామిడి పండు ఎలా తినాలనేది మాత్రం దేశ ప్రజలకు నేర్పుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మామిడిపండ్లు తినడంపై మోదీ మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల సందర్భంగా మన చౌకీదార్ ఎప్పుడైనా అవినీతి, రైతు సమస్యలు, ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి అకౌంట్లోకి రూ. 15 లక్షలు పడతాయని చెప్పారని... ఆ హామీని నెరవేర్చారా? అని అడిగారు. మామిడిపండు ఎలా తినాలనే విషయాన్ని మాత్రం దేశానికి నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. బీహార్ ను నిరుద్యోగానికి కేంద్ర బిందువుగా ఎందుకు తయారుచేశారని ప్రశ్నించారు. 

More Telugu News