అంత ముఖ్యమైన పనేంటో చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

అంత ముఖ్యమైన పనేంటో చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • ఏ సలహా కోసం రామోజీరావును కలిశావు?
  • ఓడిన తరువాత కేసీఆర్ తో రాజీ కోసమేనా?
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి ప్రశ్నలు
నిన్న హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం కావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను  కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?" అని ఆయన అన్నారు.



Vijay Sai Reddy
Twitter
Chandrababu

More Telugu News