Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి పెట్టాలి: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

  • ‘కృష్ణపట్నం స్థలం అమ్మకానికి!’ కథనంపై ప్రస్తావన
  • ప్రభుత్వ భూములను చౌకధరకు కొట్టేసి మార్కెట్ ధరకు అమ్ముకుంటున్నారు
  • ఇది ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనం

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం స్థలం అమ్మకానికి వచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఓ సూచన చేశారు. భూములను లేదా ప్రైవేట్ భూములను తక్కువ ధరలకే సొంతం చేసుకుని, ఆ తర్వాత మార్కెట్ ధరలకు అమ్ముకుంటున్న వ్యవహారంపై దృష్టిసారించాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ భూమిని లేదా ప్రైవేటు భూమిని చౌకగా కొట్టేసి మార్కెట్ ధరల కమ్ముకోవడం ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనమని ఆరోపించారు.

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి పెట్టాలి. 2550 ఎకరాలు ఎవరివి? ప్రభుత్వ భూమే చౌక ధరలో ఇచ్చుంటే వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూ సేకరణ ద్వారా రైతుల నుంచి తీసుకుంటే చెప్పిన ప్రాజెక్టు రాలేదు కాబట్టి వెనక్కు తీసుకుని రైతులకు ఇచ్చి వేయాలి’ అంటూ కృష్ణారావు వరుస ట్వీట్లు చేశారు. ‘కృష్ణపట్నం స్థలం అమ్మకానికి!’ అంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రతిని తన పోస్ట్ కి ఆయన జతచేశారు.

More Telugu News