'మామగారు' తరువాత నేను .. కోట కలిసి 100 సినిమాలు చేసుంటాము: నటుడు బాబూ మోహన్

15-05-2019 Wed 12:59
  • తమిళంలో సెంథిల్ - గౌండమణి చేశారు 
  • తెలుగులో నేను - కోట చేశాము 
  • మా కాంబినేషన్ లేని సినిమా వుండేది కాదు
ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో .. విలక్షణమైన పాత్రల్లో బాబూ మోహన్ ప్రేక్షకులను మెప్పించారు. ఒకానొక దశలో బాబూ మోహన్ లేని సినిమా ఉండేది కాదు. అంతలా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా 'మామగారు' సినిమా తరువాత ఆయనకి నటుడిగా క్షణం తీరిక లేకుండాపోయింది. ఆ విషయాలను గురించి తాజా ఇంటర్వ్యూలో బాబూ మోహన్ ప్రస్తావించారు.

"తమిళంలో హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో 'మామగారు' పేరుతో తీశారు. తమిళంలో చెప్పుకోదగిన కమెడియన్స్ సెంథిల్ - గౌండమణిపై చేసిన కామెడీ ట్రాక్ అక్కడి జనానికి విపరీతంగా నచ్చేసింది. దాంతో అదే ట్రాక్ ను తెలుగులో పెట్టగా నేను - కోట కలిసి చేశాము. ఈ సినిమాతో మా కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమా తరువాత మా కాంబినేషన్లో 100 సినిమాల వరకూ వచ్చాయి. ఈ సినిమా తరువాతే కెరియర్ పై భరోసా కలగడంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను" అని ఆయన చెప్పుకొచ్చారు.