gs lakshmi: అంతర్జాతీయ క్రికెట్ తొలి మహిళా రెఫరీగా తెలుగు మహిళ నియామకం

  • తొలి మహిళా మ్యాచ్ రెఫరీగా జీఎస్ లక్ష్మి నియామకం 
  • డొమెస్టిక్ క్రికెట్లో పలు మ్యాచ్ లకు రెఫరీగా పని చేసిన లక్ష్మి
  • ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి

భారతీయ మాజీ మహిళా క్రికెటర్ జీఎస్ లక్ష్మి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రెఫరీల ప్యానల్ లో చోటు సంపాదించారు. ఈ ప్యానల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనతను సాధించారు. 1968లో రాజమండ్రిలో ఆమె జన్మించారు. 2008-09 మధ్య కాలంలో దేశీయ మహిళా క్రికెట్లో 51 ఏళ్ల లక్ష్మి రెఫరీగా వ్యవహరించారు. మూడు మహిళా వన్డే మ్యాచ్ లకు, పలు టీ20లకు ఆమె ఐసీసీ అధికారిణిగా సేవలందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ ప్యానల్ లో చోటు దక్కించుకోవడాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ క్రికెటర్ గా, దేశీయ మ్యాచ్ రెఫరీగా తనకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

More Telugu News