ఆసక్తిని రేపుతోన్న 'కబీర్ సింగ్' ట్రైలర్
- షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్'
- కథానాయికగా కైరా అద్వాని
- జూన్ 21వ తేదీన భారీ విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథానాయకుడి స్వభావం .. ఆయా సందర్భాల్లో ఆయన ఎమోషన్స్ కు సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే, హిందీ వెర్షన్లో పెద్దగా మార్పులు చేయలేదనిపిస్తోంది. జూన్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.