Uttar Pradesh: వారణాసి లోక్‌ సభ స్థానంలో పోటీ నుంచి విరమించుకున్న అతిక్‌ అహ్మద్‌

  • క్రిమినల్‌ కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్న అతిక్‌
  • కోర్టు పెరోల్‌ మంజూరు చేయనందునే ఈ నిర్ణయమని ప్రకటన
  • తన లాయర్ ద్వారా మీడియాకు లేఖ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన అప్నాదళ్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ తాను బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పలు క్రిమినల్‌ కేసులకు సంబంధించి ప్రస్తుతం జైల్లో ఉన్న అతిక్‌ అహ్మద్‌ ఈ మేరకు తన లాయర్ ద్వారా మీడియా ప్రతినిధులకు లేఖ పంపారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు కోర్టు తనకు పెరోల్‌ మంజూరు చేయనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

జైల్లో ఉన్న అతిక్‌ నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ప్రచారం నిర్వహించుకునేందుకు తనకు మూడు వారాల పెరోల్‌ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తన హక్కని, జైల్లో ఉండి ప్రచారం చేయడం సాధ్యం కాదు కాబట్టి, తనకు పెరోల్‌ మంజూరు చేయాలని కోరారు. అయితే అతిక్‌ పిటిషన్‌ ను పరిశీలించిన కోర్టు పెరోల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నిన్న అతిక్‌ జైలు నుంచే తన లాయర్‌, ఎన్నికల ఏజెంట్‌ షాహ్నవాజ్‌ ఆలం ద్వారా  లేఖ విడుదల చేశారు.

More Telugu News