నైజామ్ లో దుమ్మురేపేస్తోన్న 'మహర్షి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నైజామ్ లో దుమ్మురేపేస్తోన్న 'మహర్షి'

  • ఈ నెల 9న విడుదలైన 'మహర్షి'
  • నైజామ్ లో 16.61 కోట్ల షేర్ 
  • మహేశ్ కెరియర్లో అత్యధిక వసూళ్లు
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుకుంటోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది.

ఏరియాలవారీగా చూసుకుంటే తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో 16.61 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇంతవరకూ ఒక్క 'బాహుబలి 2'కి మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా 'గుంటూరు' లో 5.90 కోట్ల షేర్ ను .. కృష్ణా లో 3.60 కోట్ల షేర్ ను .. 'నెల్లూరు'లో 1.74 కోట్ల షేర్ ను రాబట్టింది. మహేశ్ బాబు కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు.
Mahesh Babu
pooja hegde

More Telugu News