300 ఐపీఎల్ టికెట్లు ఇవ్వండి.. నిర్వాహకులకు తెలంగాణ అబ్కారీశాఖ లేఖ!

  • అధికారికంగా రాసిన మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
  • విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్
  • ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-12 ఫైనల్ మ్యాచ్ నేడు ఉప్పల్  స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అబ్కారీశాఖ అధికారులు తమకు ఫైనల్ మ్యాచ్ టికెట్లు కేటాయించాలని ఐపీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు. తమ ఉన్నతాధికారులు 300 టికెట్లు కావాలని కోరుతున్నారనీ, దయచేసి వాటిని సమకూర్చాలని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లేఖలో కోరారు. అయితే ఈ లేఖ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఉన్నతాధికారులకు చేరింది. దీంతో సదరు ఎక్సైజ్ సూపరిటెండెంట్ కు మెమో జారీచేసి వివరణ కోరతామని తెలిపారు.

ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో ముంబై, చెన్నై తలపడనున్నాయి. ఐపీఎల్  లో చెన్నై ఇప్పటివరకూ 8 సార్లు ఫైనల్ లో అడుగుపెట్టగా, మూడుసార్లు విజేతగా నిలిచింది. ముంబై కూడా మూడుసార్లు ఫైనల్ ట్రొఫీని ముద్దాడింది. ఈ ఫైనల్ లో ముంబైనే ఫేవరెట్ అని క్రీడా పండితులు చెబుతున్నారు. ఐపీఎల్ లో ముంబై-చెన్నై జట్లు 27 సార్లు తలపడితే, ముంబై 16 సార్లు విజయం సాధించగా, చెన్నై 11 సార్లు గెలుపొందింది.
Go Back to Shorts
ipl-12
mumbai
chennai
excise department

More Telugu News