shiva kandukuri: హీరోగా రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత తనయుడు

  • కాజల్ క్లాప్ తో మొదలైన 'మనుచరిత్ర'
  • హీరోగా రాజ్ కందుకూరి తనయుడు
  •  కథానాయికగా మేఘా ఆకాశ్

అభిరుచి కలిగిన నిర్మాతగా రాజ్ కందుకూరికి మంచి పేరుంది. ఆయన తన తనయుడు శివ కందుకూరిని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. భరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, గతంలో కాజల్ కి మేనేజర్ గా పనిచేసిన 'రాన్సన్' నిర్మిస్తున్నాడు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.

నాయకా నాయికలపై కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News