V.Hanumantha Rao: అరే భయ్ ఆయన్ను పిలువు అన్నా.. అంతే గొడవకు దిగాడు: వీహెచ్

  • టీవీ ఛానళ్ల వల్లే ఇలాంటి గొడవలు
  • ఓ కుర్రాడికి, నాకు మధ్య చిన్నపాటి ఘర్షణ
  • మాదేం పార్టీ గొడవ కాదు
  • ఉద్రేకంలో ప్రచారం కోసం ఇలా చేశాడు
ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు, నగేశ్‌కు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై వీహెచ్ స్పందించారు. ఘర్షణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అది తమ పార్టీలో ఓ కుర్రాడికి, తనకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ అని, దానిని ఇంతటితో వదిలేయండని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కుంతియా అక్కడకు వచ్చారని, ఆయన ఉన్నప్పుడు క్రమశిక్షణతో మెలగాలన్నారు.

తాను ‘అరే భయ్, ఆయన్ను పిలువు’ అని అన్నానని దీంతో నగేశ్ గొడవకు దిగాడని వీహెచ్ తెలిపారు. తమదేం పార్టీ గొడవ కాదని, వ్యక్తిగత సమస్య అని పేర్కొన్నారు. ఏదో ఉద్రేకంలో ప్రచారం కోసం ఇలా చేశాడని, తాను చర్యలు తీసుకోమని చెప్పనని తెలిపారు. అసలు టీవీ ఛానళ్ల వల్లే ఇలాంటి గొడవలు వస్తాయన్నారు. జనరల్ సెక్రటరీలుగా పార్టీకి ఉపయోగపడేవారిని తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి సూచిస్తున్నట్టు వీహెచ్ తెలిపారు.  

V.Hanumantha Rao
Kunthiya
Nagesh
Inter Board
TV Channels

More Telugu News