Andhra Pradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అధికారుల హెచ్చరిక

  • మూడు జిల్లాలకు పిడుగుల ముప్పు
  • గుంటూరు, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పడే అవకాశం
  • జి.మాడుగుల, పెదబయలు, పాడేరుకు ముప్పు
ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా గుంటూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలలోని పలు ప్రాంతాలకు పిడుగుల ముప్పు పొంచి ఉందన్నారు.

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, దుర్గి, నకరికల్లు, బెల్లంకొండ, మాచవరం, రెంటచింతల, కారంపూడి, మాచర్ల, ఈపూరుల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని జి.మాడుగుల, పెదబయలు, పాడేరు, అలాగే ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు, నాగులుప్పలపాడు, టంగుటూరు, పొదిలి, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, అద్దంకిలలో పిడుగులు పడవచ్చని తెలిపారు. 
Andhra Pradesh
Visakhapatnam District
Guntur District
Prakasam District

More Telugu News