పవన్ కల్యాణ్ విషయంలో వర్మ హెచ్చరించారు, నవ్వి ఊరుకున్నా: హరీశ్ శంకర్
- పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఓ అదృష్టం
- పవన్ తో సినిమా అంటే భారీ అంచనాలుంటాయని వర్మ అన్నారు
- గబ్బర్ సింగ్ నాటి సంగతులు వెల్లడించిన హరీశ్
'దబాంగ్ సినిమా బాలీవుడ్ లో ఎంతో పెద్ద హిట్' అని వర్మ ఓ హెచ్చరికగా చెప్పారని హరీశ్ గుర్తుచేసుకున్నారు. "నువ్వు సొంతగా స్క్రిప్ట్ లు, డైలాగులు రాయగలవు. అలాంటిది ఇప్పుడీ రీమేక్ ఎందుకు? పైగా పవన్ కల్యాణ్ తో సినిమా అంటే అంచనాలు అందుకోగలవా? అన్నారు. అందుకు నా నుంచి జవాబుగా ఓ చిరునవ్వు వెలువడింది. అది రీమేక్ కాదన్న విషయం నాకు తెలుసు. వర్మతో వాదించడం బాగుండదని ఆగిపోయాను. ఆయనే గబ్బర్ సింగ్ ప్రీమియర్ చూసి నమ్మలేకపోయారు" అంటూ నాటి సంగతులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు.