Chandrababu: ఐటీసీని ప్రపంచస్థాయి బ్రాండ్ గా మలచడంలో దేవేశ్వర్ కృషి నిరుపమానం: చంద్రబాబు

  • దేవేశ్వర్ ప్రజ్ఞ అనుసరణీయం
  • భారత పారిశ్రామిక రంగం మూలస్తంభాల్లో ఒకరు
  • ఆయన మృతి తీవ్ర విచారం కలిగించింది
ప్రముఖ వ్యాపారవేత్త, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. దేవేశ్వర్ హఠాన్మరణం చెందడం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. భారత పారిశ్రామిక రంగం మూలస్తంభాల్లో దేవేశ్వర్ ఒకరని కీర్తించారు. ఓ సాధారణ సంస్థగా ఉన్న ఐటీసీని ప్రపంచస్థాయి బ్రాండ్ గా మలచడంలో ఆయన కృషి నిరుపమానం అని కొనియాడారు. వ్యాపార రంగంలో దేవేశ్వర్ చూపిన ప్రజ్ఞ ఇతర పారిశ్రామికవేత్తలకు అనుసరణీయమని పేర్కొన్నారు.
Chandrababu

More Telugu News