కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకుని మా నాన్నకు టికెట్ ఇచ్చారు: ఆప్ నేత కుమారుడి ఆరోపణ
- బల్బీర్ సింగ్ కు పశ్చిమ ఢిల్లీ టికెట్ కేటాయింపు
- కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నారన్న సింగ్ కుమారుడు ఉదయ్
- ఆప్ కు ఓటేయవద్దని ప్రజలకు విన్నపం
ఇందుకు అంగీకరించిన తన తండ్రి, కేజ్రీవాల్ కోరిన రూ.6 కోట్లను ఇచ్చి, పశ్చిమ ఢిల్లీ టికెట్ దక్కించుకున్నారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ నగదును కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత గోపాల్ రాయ్ అందుకున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ఆప్ కు ఈసారి ఓటేయకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.