Posani Krishna Murali: డబ్బులు గట్టిగా అడిగితే నా స్క్రిప్ట్ నాకు ఇచ్చేశారు: పోసాని కృష్ణమురళి

షార్ట్స్‌లో చూడండి
ముక్కుసూటి మనిషిగా .. వ్యవహారం విషయంలో ఎంతమాత్రం మొహమాటం లేని వ్యక్తిగా పోసాని కృష్ణమురళిని గురించి చెప్పుకుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దాసరి నారాయణరావుగారితో తాను గొడవపడిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "దాసరి నారాయణరావుగారు తన తనయుడు అరుణ్ కుమార్ హీరోగా 'గ్రీకువీరుడు' సినిమా చేయడానికి నన్ను పిలిపించారు.

బయట 12 లక్షలు తీసుకుంటాను .. మీరు కనుక 6 లక్షలు ఇవ్వండి .. బౌండ్ స్క్రిప్ట్ చేతిలో పెడతాను అన్నాను. నవ్వుతూ లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చిన తరువాత డబ్బులు ఇవ్వకుండా మేనేజర్ తిప్పుతున్నాడు. 'డబ్బులైనా ఇవ్వండి .. లేదంటే నా స్క్రిప్ట్ నాకు ఇచ్చేయండి' అని డైరెక్ట్ గా దాసరిగారితోనే అన్నాను. దాంతో కొత్త కథా కథనాలతో 'గ్రీకువీరుడు' అంటూ మరుసటి రోజు ఉదయం పేపర్లో వచ్చింది .. నా స్క్రిప్ట్ నాకు ఇచ్చేశారు. ఆ స్క్రిప్ట్ లోని అంశాలను నాలుగు సినిమాలకి సర్దేశాను .. ఆ నాలుగు సినిమాలు హిట్లే" అని పోసాని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
Posani Krishna Murali

More Telugu News