maoist: రాజమండ్రిలో ఈరోజు మావోయిస్ట్ కామేశ్వరి అంత్యక్రియలు

షార్ట్స్‌లో చూడండి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో నిందితురాలైన కామేశ్వరి అలియాస్ స్వరూప అంత్యక్రియలు ఈరోజు రాజమండ్రి కోటిలింగాల శ్మశానవాటికలో జరగనున్నాయి. బుధవారం ఒడిశా కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో స్పరూప కూడా ఉన్నారు.

కామేశ్వరిది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామం. ఆర్టీసీలో ఆమె కండక్టర్ గా పని చేశారు. మావోయిస్టుల పట్ల ఆకర్షితురాలైన ఆమె 2008-09లో మావోయిస్టుల్లో చేరింది. క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది.
Go Back to Shorts
maoist
kameswari
swaroopa

More Telugu News