వెనెజువెలాపై ఆంక్షలు విధించిన అమెరికా
- రక్షణ, భద్రత రంగాలపై ఆంక్షలు
- చమురు రంగంలో కీలకమైన రెండు కంపెనీలపై కూడా ఆంక్షలు
- వెనెజువెలాలో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ పోరు
వెనెజువెలాలో ప్రస్తుతం అంతర్గత రాజకీయ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య పోరు జరుగుతోంది. ప్రతిపక్ష నేత జువాన్ కు అమెరికా మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో జువాన్ తనకు తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అతనికి అమెరికాతో పాటు యూకే, జపాన్, ఫ్రాన్స్ తదితర 50 దేశాలు అండగా ఉన్నాయి. అయితే, సైన్యం అండతో అధ్యక్షుడు మదురో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయనకు రష్యాలాంటి దేశాలు అండగా ఉన్నాయి.