chigurupati: చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్

  • జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్
  • ఏడాది పాటు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు
  • ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రాకేశ్ రెడ్డి
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్టు కింద కేసు నమోదైంది. ఏడాది పాటు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా అతనిపై పీడీ యాక్ట్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా రాకేశ్ రెడ్డి ఉన్నాడు. కాగా, జయరాం తన వద్ద తీసుకున్న రూ.6 కోట్లు వడ్డీతో సహా చెల్లించకపోవడంతో ఆయనపై రాకేశ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జయరాం మృతి చెందాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నంలో అసలు నిందితుడు రాకేశ్ రెడ్డి దొరికిపోయాడు.
chigurupati
jayaram
PD act
banjarahills

More Telugu News